అలా ఇవ్వకపోతే రాజకీయాల నుండి తప్పుకుంటా – కొడాలి నాని

Monday, November 16th, 2020, 03:19:25 PM IST

మంత్రి కొడాలి నాని ప్రతి పక్ష పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఘాటు విమర్శలు చేశారు. అయిదేళ్ల లో ప్రజల కోసం ఏమి చేయలేదు అని, ప్రజా సంక్షేమానికి పాటు పడుతున్న ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అయిదేళ్ళు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు నాయుడు పేదలకు ఇళ్లు ఇవ్వకపోగా, శకుని లా అడ్డుపడుతున్నారు అని ఆరోపించారు. చంద్రబాబు పై ఘాటు విమర్శలతో చెలరేగిన కొడాలి నాని, తను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఉరివేసుకొవదానికి సిద్దం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే చంద్రబాబు నాయుడు కి ఆయన బ్యాచ్ కి కులగజ్జి పట్టుకుంది అని, చంద్రబాబే ముఖ్యమంత్రి గా ఉండాలని కొందరు కోరుకుంటున్నారు అని ఆయన అన్నారు. డబ్బా ఛానెల్స్ లో పనికిమాలిన చర్చలు పెడుతున్నారు అని, పచ్చ మీడియా లో పిచ్చి రాతలు రాయించి జనాలను తప్పుదోవ పట్టిస్తున్నారు అని అన్నారు. తనకు ఎటువంటి వ్యాపారాలు లేవు అని, బతికి ఉన్నంత వరకు ప్రజల అభివృద్ది కోసం పని చేస్తా అని, 2024 ఎన్నికల నాటికి ఇళ్లు ఇవ్వకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాను అని మంత్రి కొడాలి నాని అన్నారు.