ఇవేవీ గుడ్డి ఛానళ్లకి..గుడ్డి చంద్రబాబు కి కనబడవు

Tuesday, November 10th, 2020, 02:24:19 PM IST

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసీపీ కీలక నేత, మంత్రి కొడాలి నాని మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నాయుడు ఎక్కడా అభివృద్ది లేదు అని జూముల్లో వాగుతున్నాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. అయితే ఇటు సీఎం జగన్ పాలన పై పలు ప్రశంసల వర్షం కురిపించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని, ఆర్ధిక కష్టాలు ఉన్న రాష్ట్రంలో పేదవారికి సంక్షేమ ఫలాలు అందాలి అన్న లక్ష్యం తో పాలన కొనసాగిస్తున్నారు అని అన్నారు.

అమ్మ వడి, అమ్మ దీవెన, మనబడి నాడు నేడు, జగనన్న గోరుముద్ద పథకాలతో వైఎస్ జగన్ రాష్ట్రంలో చదువు ఉద్యమం తీసుకు వచ్చారు అని కొనియాడారు. కానీ చంద్రబాబు తో డబ్బా కొట్టే ఛానళ్ల కి ఇవి కనబడవు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే పదివేల కోట్లు ప్రభుత్వ ఆసుపత్రుల కల్పన కి జగన్ కేటాయించారు అని, 120 కోట్ల తో గుడివాడ లో జిల్లా ఆసుపత్రి కి ఏర్పాటు చేస్తున్నాం అని, వైద్యానికి వెయ్యికి పైగా ఖర్చు ఉంటే ఆరోగ్య శ్రీ లోకి తీసుకు వచ్చాం అని, దీని ద్వారా 2,224 జబ్బులకు ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందనుంది అని అన్నారు. ఇవేవీ గుడ్డి ఛానళ్లకు, గుడ్డి చంద్రబాబు కి కనబడవు అని, ప్రజల మనసులు గెలిచిన వారే నాయకులు అవుతారు అని అన్నారు.