బిగ్ న్యూస్: జూనియర్ ఎన్టీఆరే కాదు, టీడీపీ ని ఎవరూ కాపాడలేరు – కొడాలి నాని

Monday, August 10th, 2020, 11:44:29 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. మొన్నటి వరకు తెలుగు దేశం పార్టీ కి ఉన్నటువంటి చరిష్మా, ఇపుడు లేదు. 2019 ఎన్నికల ఓటమి అనంతరం పూర్తి పరిస్థితులు మారిపోయాయి. అయితే అధికార పార్టీ వైసీపీ మాత్రం భారీ మెజారిటీ తో గెలిచి ఇక తమకు తిరుగులేదు అని నిరూపించుకుంది. అయితే తాజాగా వైసీపీ కి చెందిన నేత, కొడాలి నాని రాష్ట్ర రాజకీయ పరిణామాల పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే అందులో టీడీపీ పై చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

చంద్రబాబు నాయుడు అనంతరం టీడీపీ పగ్గాలు చేపట్టే నాయకుడి పై గత కొద్ది నెలలుగా రాష్ట్రం లో వాడివేడి చర్చలు జరుగుతున్నాయి. కొందరు నారా లోకేష్, మరి కొందరు ఎన్టీఆర్ అంటూ తమ తమ రీతిలో సమాధానం ఇస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. అయితే టీడీపీ కి నారా లోకేష్ వారసుడు అని ఫిక్స్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఒక్కడే ఇక టీడీపీ ను ఆదుకొగలడు అంటూ గతం లో కొందరు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే కొడాలి నాని ఈ వ్యవహారం పై స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు, ఇంకెవరూ కూడా టీడీపీ ను కాపాడలేరు అని, ఆ పార్టీ కి ఎక్స్ పైరీ డేట్ కూడా అయిపోయింది అని అన్నారు. అంతేకాక కొత్తగా ఎవరో కాపాడే స్థితి లో టీడీపీ లేదు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.