టీమ్ ఇండియా ను వదిలి రావడం కాస్త బాధగా ఉంది

Wednesday, January 6th, 2021, 05:40:24 PM IST

ఆసీస్ తో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో కే ఎల్ రాహుల్ ఆడకుండానే స్వదేశానికి తిరిగి వచ్చాడు. అయితే తిరుగు ప్రయాణం అనంతరం రాహుల్ భావోద్వేగం అయ్యాడు. బ్యాడ్ లక్, గాయం తో స్వదేశానికి తిరిగు పయనం కావాల్సి వచ్చింది అని, ఈ సమయం లో టీమ్ ఇండియా ను వదిలి రావడం కాస్త బాధగా అనిపించింది అని అన్నాడు. వన్డే మరియు టీ 20 మ్యాచ్ లలో ప్రతిభ కనబర్చిన రాహుల్ టెస్ట్ సీరీస్ లో మాత్రం ఆడలేక పోయాడు. అయితే మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్ లు టీమ్ ఇండియా బాగా ఆడాలి అని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అయితే ఈ మూడవ టెస్ట్ మ్యాచ్ తో రోహిత్ శర్మ రాక కూడా అభిమానులకి సంతోషాన్ని ఇస్తుంది అని చెప్పాలి.