సీఎం కేసీఆర్‌కు లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఏం కోరారంటే?

Tuesday, February 9th, 2021, 12:13:56 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి హైదరాబాద్ సిటీలో నిలిచిపోయిన ఎంఎంటీఎస్ రైళ్లను తిరిగి ప్రారంభించాలని లేఖలో పేర్కొన్నారు. ఎంఎంటీఎస్ సౌకర్యం నిలిచిపోవడంతో విద్యార్ధులు, ఉద్యోగులు, కార్మికులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నగర శివారు ప్రజలకు ఎంఎంటీఎస్ సేవలు ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయని అందుకే ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని రైల్వే శాఖతో సంప్రదింపులు జరపాలని కోరారు. అయితే ఇప్పటికే ముంబై, చెన్నై సహా పలు చోట్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ ఎంఎంటీఎస్ రైళ్లను నడుపుతుందని కూడా కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.