ఎన్నికలు వచ్చినప్పుడు కేటీఆర్‌కు పూనకం వస్తుంది.. కిషన్ రెడ్డి కామెంట్స్..!

Saturday, March 13th, 2021, 03:00:12 AM IST


తెలంగాణ మంత్రి కేటీఆర్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నేడు మీడియాతో మాట్లాడిన కిషన్ రెడ్డి నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిచిన తర్వాతనే కేసీఆర్ కుటుంబం విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాట్లాడాలని అప్పటి వరకు విశాఖ ఉక్కు గురుంచి మాట్లాడే హక్కు వారి కుటుంబానికి లేదని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని టీఆర్ఎస్ 2014 ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిందని అన్నారు.

అయితే ఏడేళ్ళవుతున్నా నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఎందుకు తెరవలేదో టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవటానికి కేంద్రాన్ని విమర్శిస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు కేటీఆర్‌కు ఎక్కడ లేని పూనకం వస్తోందని అన్నారు. 70శాతం ఫిట్‌మెంట్ ఇస్తామన్నప్పటికీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు టీఆర్ఎస్‌కు ఓటు వేయరని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.