సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..!

Friday, October 30th, 2020, 03:12:13 PM IST

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు తరఫున ప్రచారంలో పాల్గొన్న కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని సీఎం కేసీఆర్ మోసం చేశారని అన్నారు.

అయితే ఇంటికో ఉద్యోగం, దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీ ఇంత వరకు నెరవేర్చలేదని అన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనకు ఇకనైనా చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ కూతురు ఎంపీగా ఓడిపోయినా దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేశారని ఎద్దేవా చేశారు. దుబ్బాకలో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తేనే కేసీఆర్‌కు బుద్ధి చెప్పినట్టు అవుతుందని కిషన్ రెడ్డి అన్నారు.