రైతు ధైర్యంగా అడుగేయాలి – కిషన్ రెడ్డి

Tuesday, December 15th, 2020, 08:21:27 AM IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల పై ప్రతి పక్ష పార్టీ లు గగ్గోలు చేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం లో అధికార తెరాస కూడా బీజేపీ తీసుకున్న నిర్ణయం ను వ్యతిరేకిస్తూ వస్తోంది. అయితే ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరొకసారి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

రైతులు ధైర్యంగా అడుగేయాలి అంటూ కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు. రైతులు ధైర్యంగా సాగు చేయాలనే లక్ష్యం తో కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చింది అని అన్నారు. అయితే గతంలో వ్యవసాయ రంగానికి విద్యుత్ కోతలు ఉండేవి అని, ప్రస్తుతం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా విద్యుత్ కోతలు లేవు అని కిషన్ రెడ్డి అన్నారు. వన్ నేశన్ – వన్ గ్రిడ్ కింద విద్యుత్ సమస్యను పరిష్కరించాం అని తెలిపారు. సకాలంలో రైతులకు ఎరువులు అందేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం అని తెలిపారు. శీతల గిడ్డంగుల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది అని తెలిపారు. అంతేకాక దేశవ్యాప్తంగా బిందు సేద్యాన్ని ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకున్నాం అని తెలిపారు.

అయితే ప్రధాని నరేంద్ర మోడీ గారిని ఎదుర్కొనలేక రైతులను, రైతు సంఘాలను కొందరు రెచ్చగొట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రైతుల ఆశీస్సులతో అధికారం లోకి వచ్చిన పార్టీ అని, రైతులకు నష్టం కలిగించే ఏ ఒక్క నిర్ణయం కలలో కూడా తీసుకోము అని అన్నారు.