గతంలో ఇచ్చిన హామీలే.. టీఆర్ఎస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి సెటైర్లు..!

Monday, November 23rd, 2020, 06:44:03 PM IST

టీఆర్ఎస్ మేనిఫెస్టోపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విమర్శలు చేశారు. టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టో ఆచరణ సాధ్యం కాదని అన్నారు. గత ఎన్నికలల ఏమైతే హామీలు ఇచ్చారో అదే హామీలను అక్షరం పొల్లుపోకుండా మళ్ళీ ప్రకటించారని అన్నారు. ఆఖరికి గత మేనిఫెస్టో ఫ్రంట్ ఫేజీలోని కేసీఆర్ ఫోటోను కూడా మార్చలేదంటే టీఆర్ఎస్ మేనిఫెస్టో డొల్లతనం ఏ విధంగా ఉందో అర్ధమవుతుందని అన్నారు.

టీఆర్‌ఎస్‌ మాటలకు చేతలకు పొంతనలేదని అన్నారు. ప్రజలకు మాయ మాటలు చెప్పి మళ్ళీ గెలవాలని టీఆర్ఎస్ భావిస్తుందని, గ్రేటర్ ప్రజలు ఆలోచించి ఓటేయాలని కిషన్ రెడ్డి అన్నారు. విశ్వనగరం చేస్తామని విషాదనగరంగా మార్చారని మండిపడ్డారు. వరదల కారణంగా 40 మంది వరక్కు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరున్నరేళ్లుగా కొత్త రేషన్‌కార్డులు ఇవ్వడం లేదని మండిపడ్డారు.