ఏ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయబోము – కిషన్ రెడ్డి

Sunday, February 14th, 2021, 07:57:03 PM IST

మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీ అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున దుమారాన్నే రేపాయి. హైదరాబాద్ తో పాటుగా దేశంలోని చెన్నై, బెంగళూరు లాంటి పలు ప్రాంతాలను కేంద్ర పాలిట ప్రాంతం గా మార్చనుంది కేంద్ర ప్రభుత్వం అంటూ చేసిన వ్యాఖ్యలకి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అయితే ఎం ఐ ఎం పార్టీ మద్దతు నే తెరాస మేయర్ పీఠాన్ని దక్కించుకుంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే ఈసారి రెండు ఎమ్మెల్సీ స్థానాలను బీజేపీ గెలవడం ఖాయం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అమరవీరుల ఆత్మ ఘోషించే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు కిషన్ రెడ్డి.

అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల కారణంగా నే ఉద్యోగాల భర్తీ అంశాన్ని సీఎం కేసీఆర్ తెరపైకి తీసుకువచ్చారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో ఏడేళ్లు గా ఉపాధ్యాయ పోస్టులను ఎందుకు భర్తీ చేయలేదు అంటూ నిలదీశారు. అయితే హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం గా మార్చే ప్రమాదం ఉంది అని అన్న అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు. దాని పై సమాధానం చెప్పే లోపే సభ నుండి బయటికి వెళ్ళారు అంటూ చెప్పుకొచ్చారు. ఏ ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతం గా చేయబోము అని స్పష్టత ఇచ్చారు. హైదరాబాద్ తో సహా అన్ని నగరాలను కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అంటూ హామీ ఇచ్చారు. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల పలు చోట్ల చర్చలు జరుగుతున్నాయి.