మంత్రి కేటీఆర్ కి రాజకీయాలే కావాలి – కిషన్ రెడ్డి

Thursday, October 15th, 2020, 01:29:02 PM IST

కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి కిషన్ రెడ్డి మరొకసారి మంత్రి కేటీఆర్ పై ఘాటు విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ కి రాజకీయాలే కావాలి అంటూ ఘాటు విమర్శలు చేశారు. వరదలతో జనం అల్లాడుతుంటే మున్సిపల్ శాఖ మంత్రి గా రాజకీయాలు చేయడం సరైంది కాదు అని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్ హైదరాబాద్ లో వర్షాలు కురి సి, ప్రజలు బాధపడుతున్నారు అని, కేసీఆర్, కేటీఆర్ ఎవరైనా ఈ సమయం లో రాజకీయాల గురించి మాట్లాడటం వారి హోదాకు తగదు అని కిషన్ రెడ్డి తెలిపారు.

అయితే తనకు ప్రజల బాగోగులు ముఖ్యం అని,వారిని ఆదుకోవడం పైనే దృష్టి పెడతాం అని, రాజకీయ రాద్దాంతం చేయడం సరికాదు అని కిషన్ రెడ్డి అన్నారు. ఈ విషయం లో రాష్ట్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు నీట మునగడం తో బాధిత ప్రాంతాల్లో పర్యటించేందుకు కిషన్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. అంతేకాక బీజేపీ నేతలకి, కార్యకర్తలకు సహాయ సహకారాలు అందించాలని కిషన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.