హైదరాబాద్‌లో కరోనా పరిస్థితిపై కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Saturday, July 4th, 2020, 11:44:20 PM IST


తెలంగాణలో రోజు రోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే రాష్ట్రంలో నమోదవుతున్న కేసులలో ఎక్కువ శాతం కేసులు హైదరాబాద్‌లోనే నమోదవుతున్నాయి. అయితే హైదరాబాద్‌లో కరోనా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

అయితే దేశంలోని ప్రధాన నగరాల్లో ఒకటైన భాగ్యనగరం డేంజర్ జోన్‌లో ఉందని అన్నారు. కరోనా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, టెస్టులు చేయించుకోవాలంటే ఎక్కడికి వెళ్ళాలో నగర ప్రజలకు తెలియని పరిస్థితి నెలకొందని అన్నారు. కరోనా కట్టడి కోసం తెలంగాణకు కేంద్రం పెద్ద ఎత్తున సాయం చేసిందని మంత్రి ఈటెల చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు.