మేయర్ పీఠం బీజేపీదే.. రాసిపెట్టుకోండంటున్న కిషన్ రెడ్డి..!

Wednesday, November 25th, 2020, 06:57:12 PM IST

గ్రేటర్ ఎన్నికల ప్రచారం హోరెత్తిపోతుంది. ప్రచారంలో భాగంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికలలో బీజేపీదే గెలుపు అని అన్నారు. యువత, విద్యార్థులు, మహిళలు పూర్తిగా బీజేపీకే మద్దతు తెలుపుతున్నారని చెప్పుకొచ్చారు. జీహెచ్‌ఎంసీలో మెరుగైన పాలన అందించేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నారు.

నగరంలో ఎలక్షన్‌ కోడ్‌ వచ్చిన తర్వాత కూడా ఎక్కడబడితే అక్కడ టాయిలెట్లు ఏర్పాటు చేసి తండ్రికొడుకుల బొమ్మలు తగిలించుకున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. కేంద్రంపై అబద్ధాలు ప్రచారం చేయడంలో తండ్రీ కొడుకులు పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. నీతి, నిజాయితీతో పనిచేసే బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే హక్కు వారికి లేదని అన్నారు. మొన్న దుబ్బాకలో గెలిచామని, ఇప్పుడు జీహెచ్ఎంసీలో కూడా గెలిచి మేయర్ పీఠాన్ని దక్కించుకుంటామని, బీజేపీ గెలుపును ఆపడం ఎవరివల్ల సాధ్యం కాదని అన్నారు.