భారీ వర్షాలు: ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి – కిషన్ రెడ్డి

Wednesday, October 14th, 2020, 08:06:24 AM IST

తెలంగాణ రాష్ట్రం లో మరో రెండు రోజుల పాటు భారీ నుండి అతి భారీ వర్షాలు కురవనున్నాయి. అయితే ఇప్పటికే పలు ప్రాంతాలు మింపుకి గురి అవ్వడం తో పలు చోట్ల రెడ్ అలెర్ట్ ప్రకటించారు అధికారులు. ఈ మేరకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పలు వ్యాఖ్యలు చేశారు.ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. లోతట్టు మరియు వరద ముప్పు ఉన్న ప్రాంతాల వారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అని, అత్యవసరం ఉంటే తప్ప ఎవరూ కూడా బయటికి వెళ్ళవద్దు అని కిషన్ రెడ్డి అన్నారు.

అయితే ఈ భారీ వర్షాల్లో సహాయక చర్యల కోసం అధికారులు, సిబ్బంది తో కలిసి పాల్గొనడానికి స్వచ్ఛంద సేవకులు, వాలంటీర్లు, పౌరులు ముందుకి రావాలి అని అన్నారు. అంతేకాక వ్యక్తిగతంగా ఎన్డిఆర్ఎఫ్ డీజీ తో కూడా మాట్లాడా అని, సహాయక బృందాలను సిద్దంగా ఉంచాలని ఆదేశించినట్లు వివరించారు. హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాలు ముంపుకి గురి కావడం తో ప్రజలు అంతా కూడా బయటికి రావొద్దు అని అధికారులు సూచిస్తున్నారు.