ఎన్టీఆర్ కి జోడీగా కియారా అద్వానీ?

Friday, November 27th, 2020, 04:31:39 PM IST

జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక చిత్రం కన్ఫర్మ్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం అధికారికంగా ప్రకటించిన్నప్పటి నుండి అభిమానులు ఇందుకు సంబంధించిన ప్రతి ఒక్క చిన్న అప్డేట్ పై ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే ఈ చిత్రం లో కథానాయిక పాత్ర కూడా కీలకం అయిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం ముందుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ పలువురుని సంప్రదించినట్లు వార్తలు వచ్చాయి. ఇదే నేపద్యం లో రష్మిక ఎన్టీఆర్ సరసన నటించనుంది అన్నట్లు గా పుకార్లు షికార్లు చేశాయి. అయితే తాజాగా ఈ విషయం లో మరొక వార్త సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ లో చెక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రం లో ఎన్టీఆర్ సరసన కీయారా అద్వానీ కథానాయికగా నతించనుంది అని ప్రస్తుతం వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై ఇంకా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటన చేయలేదు. అయితే ఈ చిత్రం లో కియార అద్వానీ కథానాయికగా నటిస్తే రష్మిక కి ఛాన్స్ లేనట్టేనా అంటూ ఆ హీరోయిన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న తారక్ రౌద్రం రణం రుధిరం చిత్రం పూర్తి అవ్వగానే, త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించనున్నారు. అయితే ఈ చిత్రం ఎన్టీఆర్ కి 30 వ చిత్రం కానుంది. ఇది వరకు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో అరవింద సమేత సినిమా చేశారు ఎన్టీఆర్.