కొలువుతీరిన ఖైరతాబాద్ వినాయకుడు… ఆన్లైన్ ద్వారా దర్శించుకునేందుకు ఏర్పాట్లు!

Saturday, August 22nd, 2020, 10:13:22 PM IST


తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ప్రాచుర్యం పొందిన ఖైరతాబాద్ వినాయకుడు, ధన్వంతరి నారాయణ మహా గణపతి గా కొలువు తీరారు. తాపేశ్వరం నుండి సురుచి ఫుడ్స్ వారు తయారు చేసిన వంద కిలోల లడ్డూ ప్రసాదం గణనాథుని చేతిలో కొలువు తీరింది. అయితే ఈ సారి 9 అడుగుల ఎత్తులో గణపయ్య ను ఏర్పాటు చేశారు. తొలిసారిగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

అక్కడి స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు గణనాథుని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పది కిలోల వెండి ను దేవుడి కి బహు కరించారు. అయితే కరోనా వైరస్ హైదరాబాద్ లాంటి మహా నగరాల్లో ఇంకా ఎక్కువగా ఉండటం తో దర్శనానికి భక్తులకు అనుమతి నిరాకరించారు. ఆన్లైన్ ద్వారా దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.