ఈ ఏడాది భారీగా తగ్గిన ఖైరతాబాద్ గణేశుడి ఎత్తు..!

Tuesday, August 11th, 2020, 09:00:47 AM IST

ఖైరతాబాద్ గణేశుడు అంటే చాలు మనకు గుర్తొచ్చేది భారీ ఎత్తు మరియు ఆకారం. అంతేకాదు ఆ భారీ గణేశుడి చేతిలో పెట్టే లడ్డూకి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఏటా ఈ గణేశుడి దర్శనం, నిమర్జనానికి లక్షాలాది మంది భక్తులు హాజరవుతుంటారు.

అయితే ఈ ఏడాది కరోనా కారణంగా గణేశుడి ఎత్తును భారీగా తగ్గించారు నిర్వాహకులు. ఏడాదికొక అడుగు చొప్పున ఎత్తు పెరుగుతూ 2019లో 65 అడుగుల ఎత్తులో కొలువైన గణపయ్య ఈ సారి కేవలం 9 అడుగుల ఎత్తుకే పరిమితమయ్యాడు. ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువవుతున్న స్వామికి అటూ ఇటూ లక్ష్మీ, సరస్వతి అమ్మవార్లు కొలువుదీరనున్నారు.