యశ్ పుట్టిన రోజున “కేజీఎఫ్ ఛాప్టర్ 2” టీజర్ విడుదల

Thursday, December 3rd, 2020, 04:03:03 PM IST

కేజీఎఫ్ చిత్రం విడుదల అయి మూడు సంవత్సారాలు అవుతుంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఇంకా చిత్రీకరణ దశలో ఉంది. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయాలని భావించినా, కరోనా వైరస్ లాక్ డౌన్ కారణం గా షూటింగ్ కూడా పూర్తి చేసుకోలేక పోయింది. అయితే మొదటి పార్ట్ తో ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేయడం తో కేవలం కన్నడ సినీ ప్రేమికులు మాత్రమే కాకుండా, మిగతా భాషలకు చెందిన వారు కూడా ఈ చిత్రం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ కేజీఎఫ్ 2 టీజర్ విడుదల కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

అయితే చిత్ర యూనిట్ కి, హొంబలే ఫిలిమ్స్ కి రోజుకి సందేశాలు పంపుతూ అభిమానులు టీజర్ విడుదల చేయండి అంటూ కోరుతున్నారు. అయితే డిసెంబర్ 21, 2018 లో మొదటి పార్ట్ విడుదల కాగా, ఆ రోజు అయినా టీజర్ ను విడుదల చేయండి అంటూ పలువురు కోరగా, నిర్మాత కార్తీక్ గౌడ స్పందించారు. వచ్చే ఏడాది జనవరి 8 న యశ్ పుట్టిన రోజున ఈ చిత్ర టీజర్ ను విడుదల చేస్తామని తెలిపారు.టీజర్ వేరే లెవెల్ లో ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు. అయితే కార్తీక్ గౌడ చేసిన ట్వీట్ కి నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ చిత్రం లో అధిరా పాత్రలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నారు. రమీక సేన్ పాత్రలో రవీనా టాండన్ నటిస్తున్నారు. ఈ చిత్రం లో ప్రకాష్ రాజ్ తో పాటుగా ప్రముఖ తెలుగు నటుడు రావు రమేష్ మరొక కీలక పాత్ర పోషిస్తున్నారు.