జనవరి 8 న “కేజీఎఫ్” యశ్ సామ్రాజ్యాన్ని పరిచయం చేయనున్న చిత్ర యూనిట్!

Monday, December 21st, 2020, 12:45:54 PM IST

దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 కి సంబంధించిన అప్డేట్ ను తాజాగా వెల్లడించారు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను జనవరి 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. యశ్ సామ్రాజ్యం ను దర్శకుడు ప్రశాంత్ నీల్ జనవరి 8 న చూపించనున్నారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే జనవరి 8 న యశ్ పుట్టిన రోజు కావడం తో టీజర్ ను విడుదల చేయనున్నారు.

నేటికీ కేజీఎఫ్ విడుదల అయి రెండు సంవత్సరాలు కావడం తో చిత్ర యూనిట్ నేడు టీజర్ కి సంబంధించిన అప్డేట్ ను ఇవ్వడం జరిగింది. ఈ చిత్రం సీక్వెల్ ను పాన్ ఇండియన్ తరహాలో తెరకెక్కిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రం లో యశ్ సరసన కథానాయికగా శ్రీనిధి శెట్టి నటిస్తుండగా, రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం మొదటి పార్ట్ సంచలనం సృష్టించడం తో సీక్వెల్ పై భారీ అంచనాలే నెలకొన్నాయి.