కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ సరికొత్త రికార్డ్!

Friday, January 8th, 2021, 05:20:50 PM IST

యశ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన కేజీఎఫ్ చాప్టర్ 2 టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు కేజీఎఫ్ చిత్రం కన్నడ సినిమా పరిశ్రమ లో సూపర్ హిట్ విజయం సాధించగా, తెలుగు తమిళ, ఇతర బాషల్లో కూడా తన సత్తా చాటింది. అయితే ఈ చిత్రం సీక్వెల్ కూడా అంతకుమించి ప్లాన్ చేశారు చిత్ర యూనిట్. వేగంగా రెండు మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న టీజర్ గా రికార్డ్ నెలకొల్పగా, ఇప్పటి వరకు ఈ టీజర్ 5.4 కోట్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. 3.5 మిలియన్ లైక్స్ ను సంపాదించింది. అయితే ఇప్పటి వరకు ఒక్క రోజులో అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ విషయం లో మరే టీజర్ కి దక్కని రికార్డ్ ను ఈ చిత్రం సొంతం చేసుకుంది.

అయితే ఈ చిత్రం లో మదర్ సెంటిమెంట్ తో పాటుగా, అదీరా పాత్ర పై సైతం ఆసక్తి నెలకొంది. చిత్రం మొదటి పార్ట్ లో గరుడ ను చంపిన యశ్, ఆ తర్వాత సామ్రాజ్యం ను ఎలా చేజిక్కించుకున్నాడు, మిగతా సైన్యాన్ని ఎలా ఎదుర్కొన్నాడు. ఇనాయత్ కలీల్, రమీకా సేన్ ల పాత్రలతో పాటుగా, మిగతా ప్రధాన తారాగణం పై కూడా ఆసక్తి నెలకొంది. టీజర్ లో మాస్ పవర్ ను చూపించిన ప్రశాంత్ నీల్, చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్ కి విడుదల చేసే అవకాశం ఉంది.