పక్కా ప్లానింగ్ తో దూసుకుపోతున్న కేజిఎఫ్ టీమ్

Friday, October 9th, 2020, 05:15:31 PM IST

కేజీఎఫ్ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. బెంగళూరు మరియు హైదరాబాద్ ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే గత కొన్ని నెలలుగా కరోనా వైరస్ ఎఫెక్ట తో లాక్ డౌన్ కారణం గా సినిమా షూటింగ్ లు, థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్ లాక్ ప్రక్రియ మొదలు కావడం తో షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం అయింది.

అయితే ఈ షెడ్యూల్ లో సినిమా కి సంబంధించిన పూర్తి షూటింగ్ పూర్తి కానుంది. కేజీఎఫ్ చిత్రం తో సౌత్ ఇండియా లో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టడం మాత్రమే కాకుండా, ఇండియా లో కూడా క్రేజ్ ను సొంతం చేసుకోవడం తో కేజీఎఫ్ చాప్టర్ 2 ను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లో రాకీ భాయ్ పాత్ర లో యశ్ నటిస్తుండగా, శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం లో అధీరా పాత్రలో సంజయ్ దత్ నటిస్తున్నారు. రావు రమేష్ సైతం ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.