రిజర్వ్ బ్యాంక్ కీలక నిర్ణయంతో ఊపందుకున్న మార్కెట్లు

Wednesday, March 4th, 2015, 10:47:46 AM IST

rbi
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం రెపో రేటును తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ నిర్ణయంతో మార్కెట్లో జోరుమీద పరిగెడుతున్నాయి. నిన్న ప్రకటించిన వెంటనే తొలిసారి దేశీయ మార్కెట్లు 9000 మార్కును దాటింది. కాగా, తాజాగా రిజర్వ్ బ్యాంక్ నిర్ణయం బుధవారం నుంచి అమలులోకి వస్తుందని చెప్పడంతో… ఈరోజు ఉదయం నుంచే మార్కెట్లు దూకుడు మీద ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును తగ్గించడం రెండు నెలల్లో ఇది రెండో సారి. రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న ఈ నిర్ణయంతో గృహ, వాహన మరియు వ్యక్తిగత రుణాలు తీసుకున్న ఖాతాదారులకు ఇది శుభవార్తె అని చెప్పవచ్చు. గతంలో రెపో రేటు 7.5 గా ఉండేది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ తీసుకున్న నిర్ణయంతో ఈ రెపో రేటు 7.25కి తగ్గిపోయింది. క్షీనిస్తున్న ఆర్ధిక వృద్ది వ్యవస్థను మెరుగుపరిచేందుకు మరియు పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.