వైయస్సార్ ఉచిత విద్యుత్ పథకం – నగదు బదిలీ పథకం లాభాలు ఇవే!

Friday, September 4th, 2020, 11:23:51 PM IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం నుండి అనేక హామీలను అమలు చేస్తూ, ప్రజల మనసు అశేష ఆదరణ సంపాదించు కొన్నారు. అయితే సీఎం జగన్ మోహన్ రెడ్డి వైయస్సార్ ఉచిత విద్యుత్ పథకం – నగదు బదిలీ పథకం తాజాగా ప్రవేశ పెట్టారు. అయితే ఇందుకు సంబంధించిన పలు లాభాలను తాజాగా పార్టీ తెలిపింది.

ప్రభుత్వం నుండి ఇక పై ఎంత సాయం రైతులకు అందుతుందొ తెలుస్తోంది అని తెలిపారు. విద్యుత్ కంపెనీ కి ప్రభుత్వం చేసిన సహాయం తో బిల్లులు చెల్లించడం ద్వారా తమకు నాణ్యమైన విద్యుత్ ను అందించమని అడిగే హక్కు వారికి ఉంటుంది అని అన్నారు. విద్యుత్ కంపెనీ ల పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. కంపెనీ ల విద్యుత్ కొనుగోలు వినియోగం, కొనుగోలు, వృధా లెక్కలు స్పష్టం గా తెలుస్తాయి. ఈ లెక్కలు తెలియడం వలన విద్యుత్ వృధా మరియు నష్టాలను అరికట్టేందుకు వీలు అవుతుంది.