ఎన్టీఆర్ సరసన “రొమాంటిక్” బ్యూటీ?

Friday, November 20th, 2020, 05:28:11 PM IST

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రం తర్వాత ఇదే సినిమా లో నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పూజ హెగ్డే నటించగా, ప్రస్తుతం ఈ చిత్రం కోసం మరొక హీరోయిన్ ను చూస్తున్నారు. పూజ హెగ్డే అని అనుకున్నా, వర్కౌట్ అవ్వదు అని, కీర్తి సురేష్ నటించనున్నారు అని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెరపైకి మరొక కథానాయిక పేరు వచ్చింది.

రొమాంటిక్ చిత్రం లో ఆకాష్ పూరి తో రొమాన్స్ చేస్తున్న హాట్ భామ కేతిక శర్మ ఎన్టీఆర్ సరసన నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీని పై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఒక వేళ కేతీక శర్మ కన్ఫర్మ్ అయితే ఎన్టీఆర్ సినిమా కి కెతిక గ్లామర్ అదనపు ఆకర్షణ అనడం లో ఎటువంటి సందేహం లేదు.