టీడీపీలో దుష్టశక్తులు కుట్ర పన్నాయి : కేశినేని

Friday, November 21st, 2014, 03:21:36 PM IST

keshineni

టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా చేసిన కామెంట్స్ ఆ పార్టీలో చర్చనీయాంశమవుతున్నాయి. తనను పార్టీ నుంచి గెంటి వేసేందుకు కొన్ని దుష్టశక్తులు కుట్ర పన్నాయని ఆరోపించారు. మొన్నటి ఎన్నికల్లోనూ తనకు టికెట్ రాకుండా చేసేందుకు ఆ శక్తులు శాయశక్తులా ప్రయత్నించాయని ఆయన ఆరోపించారు. బెజవాడ పాలిటిక్స్ లో నాని కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

కేంద్ర మంత్రి సుజనా చౌదరి సన్మానం కోసం ఏర్పాటు చేసిన సభా వేదికపైనే నాని ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ దుష్ట శక్తులు ఎవరన్న విషయంపై నాని స్పష్టత ఇవ్వలేదు. దీంతో నాని చెబుతున్న దుష్ట శక్తులు ఎవరన్న విషయంపై పార్టీలో చర్చ మొదలైంది.