ఇష్టమొచ్చినట్టు హామీలిచ్చి జగన్ ప్రజలను మోసం చేశాడు – కేశినేని నాని

Wednesday, September 30th, 2020, 02:12:34 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సీరియస్ వ్యాఖ్యలు చేశారు. దేశంలో విఫలమైన ఏకైక సీఎం జగన్ మాత్రమేనని ఎంపీ కేశినేని నాని అన్నారు. ఎన్నికలకు ముందు జగన్ ఇష్టం వచ్చినట్లు హామీలిచ్చి తీరా గెలిచాక ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. టీడీపీ సెక్యులర్ పార్టీ అని అన్ని మతాలు, కులాలు పార్టీకి సమానమేనని అన్నారు.

అయితే విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఎంతో కృషి‌చేశారని కానీ దానిని జగన్ ఖూనీ చేస్తున్నారని అన్నారు. తనపై ఉన్న కేసులకు భయపడి జగన్ రాజ్యసభలో కేంద్రానికి మద్దతిస్తున్నారని చెప్పారు. ఇదిలా ఉంటే దేవాలయాలపై వరుస దాడులు జరుగుతున్నాయని, దీనికి సంబంధించి బాధితులెవరైనా కఠినంగా శిక్షించాలని టీడీపీ ‌డిమాండ్ చేస్తుందన్నారు. దేవాలయాలపై జరుగుతున్న దాడులకు బాధ్యత వహించి మంత్రి వెల్లంపల్లి రాజీనామా‌ చేయాలని డిమాండ్ చేశారు.