స్టువర్టుపురం దొంగలను నిలుచోపెట్టే చరిత్ర వైసీపీది – కేశినేని నాని

Monday, February 22nd, 2021, 05:32:31 PM IST

Kesineni_Nani

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని నాని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విజయవాడ కార్పొరేషన్‌ ఖచ్చితంగా టీడీపీకే దక్కుతుందని ఎంత మంది మంత్రులు వచ్చినా, ఆఖరికి ముఖ్యమంత్రే వచ్చినా ఇందులో మార్పు ఉండదని అన్నారు. 39వ డివిజన్‌ అభ్యర్ధి నూటికి నూరు శాతం శివశర్మే విజయం సాధిస్తారని కేశినేని నాని జోస్యం చెప్పారు.

అయితే విజయవాడకు తాను అధిష్టానం అయితే, రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అధిష్టానమని కేశినేని నాని అన్నారు. ఒక కుటుంబంలో ఉన్నప్పుడు అనేక ఇబ్బందులు వస్తుంటాయి.. పోతుంటాయని అసలు వైసీపీలో సఖ్యత ఉందా అని ప్రశ్నించారు. నాలుగు పార్టీలు మారిన మంత్రి సఖ్యత గురుంచి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. అయితే చదువుకున్న అభ్యర్ధులపై 16 కేసులున్న స్టువర్టుపురం దొంగలను నిలుచోపెట్టే చరిత్ర వైసీపీది అని ఎద్దేవా చేశారు. టీడీపీ అధికారంలోకి వస్తే సామాన్యులపై ఒక్క రూపాయి కూడా పన్ను పెంచమని కేశినేని నాని చెప్పుకొచ్చారు.