చెత్త రాజకీయాలు మానుకోండి.. వైసీపీపై మండిపడ్డ ఎంపీ కేశినేని నాని..!

Friday, September 18th, 2020, 02:10:02 PM IST

Kesineni

అమరావతిలో భూకుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు జరపాలని, కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ నిన్న పార్లమెంట్ ఆవరణలో వైసీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. అయితే దీనిపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్ వేదికగా వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. సాక్షి పేపర్‌లో వైసీపీ ఎంపీలు చేపట్టిన ధర్నాను ప్రచురిస్తే, ప్రాంతీయ పార్టీల ఎంపీలందరూ కలిసి జీఎస్టీ బకాయింపులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ధర్నాను ఈనాడులో ప్రచురించారు.

అయితే ఈ రెండు పేపర్ క్లిప్పింగులను పోస్ట్ చేస్తూ ఏ అంశం మీద అయినా సీబీఐ ఎంక్వైరీ జరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్రం ఆమోదం తెలపడం ఆనవాయితీ దానికి ధర్నాలు అవసరం లేదు జగన్ గారూ అని, రాష్ట్రానికి రావలసిన వాటి కోసం
వైసీపీ పార్టీ ఎంపీలు పోరాడితే ప్రజలు హర్షిస్తారు చెత్త రాజకీయాలు మాని రాష్ట్రానికి రావాల్సిన వాటి పైన పోరాటం చేయండని సూచించారు.