బీహార్ తరహాలో సీఎం జగన్‌ పాలన సాగుతుంది.. కేశినేని నాని ఫైర్..!

Friday, November 13th, 2020, 03:02:43 AM IST


వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎంపీ కేశినేని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అన్నారు. అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలంటూ విజయవాడలో టీడీపీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టగా, దానికి కూడా అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడం దారుణమని అన్నారు. అయితే బీహార్ తరహాలో సీఎం జగన్‌ పాలన సాగిస్తున్నాడని అది మంచిది కాదని అన్నారు.

అయితే బలహీనవర్గాలు, మైనార్టీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ఇప్పుడు వారిపై దోపిడీలు, దౌర్జన్యాలు ‌చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు పెట్టి వారిని చిత్ర హింసలకు గురిచేస్తున్నారని, వైసీపీ నేతల అండతో పోలీసులు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అబ్దుల్ సలాం కేసులో అధికార పార్టీ నేతలపై చర్యలు లేవని, సలాం ఘటనపై కేంద్ర హోంమంత్రికి ఫిర్యాదు చేస్తామని కేశినేని నాని ప్రకటించారు.