ఫ్లై ఓవర్‌ని కూడా 3 ముక్కలు చేసేవారు.. జగన్ సర్కార్‌పై కేశినేని సీరియస్..!

Monday, August 24th, 2020, 01:41:43 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. నేడు నిర్మాణం పూర్తి చేసుకున్న దుర్గ గుడి ప్లై ఓవర్‌ను అధికారులతో కలిసి పరిశీలించిన కేశినేని నాని ఫ్లైఓవర్ పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఫ్లైఓవర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని బెజవాడ ప్రజల చిరకాల కోరిక నెరవేరబోతుందని అన్నారు.

అయితే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సహకారంతో ఆరు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయ్యిందని, వచ్చే నెల 4వ తేది కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఫ్లైఓవర్‌ను ప్రారంభించబోతున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత ప్రజలను సీఎం జగన్ మోసం చేశారని అన్నారు. ఫ్లై ఓవర్ ఆయన పరిధి కాదు కాబట్టి దీని జోలికి రాలేదని లేదంటే ఫ్లై ఓవర్‌ని కూడా మూడు ముక్కలు చేసేవారని మండిపడ్డారు.