సీఎం జగన్ పచ్చి మోసకారి.. కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు.!

Sunday, August 23rd, 2020, 08:48:08 PM IST

ఏపీ సీఎం జగన్‌పై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తీసుకువస్తానని మాయ మాటలు చెప్పిన జగన్ ఇప్పుడు అసలు నోరు మెదపడం లేదని అన్నారు. జగన్ పచ్చి మోసకారని కేసులు నుండి బయట పడటానికి కేంద్రంతో లాబీయింగ్ చేశారే తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కాదని అన్నారు.

అయితే సీఎం పదవి జగన్‌కు పర్మినెంట్ కాదని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. హిట్లర్ వంటి వారే కాల గర్భంలో కలిశారని జగన్ అంతకంటే హీనమని అన్నారు. టీడీపీ నేతలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఆనాడు చంద్రబాబు మీద నమ్మకంతో రాజధాని కోసం రైతులు 33 వేల ఎకరాలు ఇచ్చారని, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ది చెబుతారని అన్నారు.