మోడీ కి, భారత్ కి థాంక్స్ చెప్తూ కెనడా లో ఫ్లెక్సీల ఏర్పాటు

Thursday, March 11th, 2021, 01:17:07 PM IST

కరోనా వైరస్ మహమ్మారి ఒక్క భారత్ ను మాత్రమే కాక, మిగతా దేశాలను సైతం పట్టి పీడిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ప్రపంచ దేశాలు ఈ వైరస్ భారిన పడి లక్షల మంది ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. అయితే ఈ మహమ్మారి కి భారత్ వాక్సిన్ లను కనుగొన్న సంగతి అందరికీ తెలిసిందే. భారత్ ఒక్క కెనడా కి మాత్రమే కాకుండా మిగతా దేశాలకు సైతం వాక్సిన్ ను పంపిణీ చేస్తోంది. ఈ ప్రక్రియ ను జనవరి 20 నుండి కొనసాగిస్తూనే ఉంది. అయితే భారత్ తమ దేశానికి వాక్సిన్ పంపిణీ చేసినందుకు గాను కెనడా లో థాంక్స్ చెబుతూ ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు.

కెనడా లోని గ్రేటర్ టొరంటో ప్రాంతం లో భారత్ కి మరియు ప్రధాని నరేంద్ర మోడీని కి థాంక్స్ చెబుతూ ఫ్లెక్సీ లు కనిపించాయి.మోడీ ఫోటో తో పాటుగా భారత్ మరియు కెనడా కి చెందిన జాతీయ జెండా లు సైతం అందులో కనిపించాయి. హిందూ ఫోరం కెనడా అధ్వర్యంలో ఏర్పాటు అయిన ఈ ఫ్లెక్సీ లు భారత్ మరియు కెనడా ల స్నేహం వర్ధిల్లాలి అంటూ నినదించాయి.అయితే ఎన్నో దేశాలకు వాక్సిన్ ను పంపిణీ చేస్తున్న భారత్ ఐక్య రాజ్య సమితి కి కూడా వాక్సిన్ ను పంపనుంది.