ఫ్లాష్ న్యూస్: కీసర మాజీ తహశీల్దార్ ఆత్మహత్య

Wednesday, October 14th, 2020, 11:02:47 AM IST

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు ఆత్మహత్య కి పాల్పడ్డాడు. అవినీతి మరియు లంచం తీసుకున్న కేసులో విచారణ ఎదుర్కొంటున్న నాగరాజు చంచల్ గూడ జైలు లో రిమాండ్ ఖైదీ గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో ఆయన జైలు లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే అతని మృత దేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం జరిగింది.

అయితే మాజీ తహశీల్దార్ నాగరాజు కొన్ని కోట్ల విలువ కలిగిన భూమి నీ స్థిరాస్తి వ్యాపారం చేసే వారి పేరు మీదికి బదిలీ చేయించే క్రమం లో రెండు కోట్ల రూపాయల వరకు లంచం డిమాండ్ చేసినట్లు తెలిసిందే. అయితే ఈ నేపధ్యంలో లో స్థిరాస్తి వ్యాపారులు అయిన అంజిరెడ్డి మరియు శ్రీనాథ్ లు అతనికి కోటి పది లక్షల రూపాయలు లంచం ఇచ్చే సమయం లో ఏసీబీ అధికారులు పక్కా ప్లాన్ తో పట్టుకోవడం జరిగింది. అయితే నాగరాజు కి సంబంధించిన అక్రమాలు ఇంకా కొన్ని వెలువడాల్సి ఉండగా, ఈ నేపధ్యంలో ఆత్మహత్య కి పాల్పడ్డాడు.