ఫోటో టాక్ : అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో షాకిచ్చిన కీర్తి సురేష్ !

Tuesday, December 19th, 2017, 08:15:02 PM IST

ఎప్పుడూ క్యూట్ లుక్స్ తో అందంగా కనిపించే కీర్తిసురేష్.. అజ్ఞాతవాసి ఆడియో వేడుకకు మాత్రం డిఫెరెంట్ గా తయారై వచ్చింది. అజ్ఞాతవాసి చిత్రంలో కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు. అజ్ఞాతవాసి ఆడియో వేడుకలో కీర్తి దర్శనమిచ్చిన లుక్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోయారు. కాస్త స్పైసీగా కనిపించాలని కీర్తి ప్రయత్నించినట్లు ఉంది.

అజ్ఞాతవాసి ఆడియో వేడుక ఇప్పటికే ప్రారంభం అయింది. కీర్తి సురేష్ తో పాటు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న అలనాటి హీరోయిన్ ఖుష్బూ కూడా హాజరయ్యారు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.