చంద్రబాబును కలిసిన కేఈ ప్రభాకర్‌.. వైసీపీ బెదిరింపులపై ఫిర్యాదు..!

Wednesday, February 3rd, 2021, 03:00:18 AM IST


టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని డోన్‌ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్‌ కలిశారు. డోన్‌ టీడీపీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారి ఆయన చంద్రబాబు నాయుడుతో భేటీ అయ్యారు. ప్రస్తుతం పంచాయితీ ఎన్నికలు జరుగుతుండడంపై దీనిపై చంద్రబాబుతో చర్చించిన కేఈ ప్రభాకర్ తన నియోజకవర్గంలో మొత్తం 81 పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులను పోటీలో నిలుపుతున్నట్టు చెప్పుకొచ్చారు.

అయితే వైసీపీ నాయకులు ఏకగ్రీవాల కోసం పోలీసు అధికారులతో ఒత్తిళ్లు తెస్తున్నారని చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధికార దుర్వినియోగంపై ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసినట్లు చెప్పుకొచ్చారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు బనాయిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ప్యాపిలి మండలం బూరుగల గ్రామంలో, బేతంచెర్ల మండలంలో వైసీపీ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అయితే టీడీపీ మద్ధతుతో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అన్ని రకాలుగా సహకారం అందిస్తుందని చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు.