మరో ఏడాది పాటు రైతు భీమా పొడిగించిన కేసీఆర్ సర్కార్..!

Tuesday, August 11th, 2020, 07:31:26 AM IST

తెలంగాణ రాష్ట్రంలో రైతుల పేరిట ఉన్న రైతు భీమా పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అయితే తాజా ఉత్తర్వుల ప్రకారం ఈ నెల 14 నుంచి ఆగష్ట్ 31 వరకు ఈ పథకం అమలులో ఉండనుంది. ఈ పథకం కింద ఏడాదికి 32.73 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి 3,486 చొప్పున మొత్తం 1,141 కోట్లను ప్రభుత్వమే భీమా సంస్థకు చెల్లించనుంది. 1961 ఆగష్ట్ 14 నుంచి 2002 ఆగష్ట్ 14 వ తేది మధ్య జన్మించిన వారు ఈ పథకానికి అర్హులుగా నిర్ణయించిన సంగతి తెలిసిందే.