జగన్ తరహా ప్లానింగ్ లో కేసీఆర్ సర్కార్..!

Friday, August 7th, 2020, 11:26:59 AM IST

కరోనా వైరస్ కష్ట కాలాన్ని మన రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఎదుర్కోవడంలో ఏమంత ఆశాజనకమైన పెర్ఫార్మన్స్ ను కనబరచలేదని చెప్పాలి కరోనా టెస్టుల దగ్గర నుంచి సామాన్య ప్రజలకు అందించే వైద్యం వరకు ఏదొక లోపం కనిపిస్తూనే ఉంది. దీనితో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణాతో పోలిస్తే ఏపీలో రికార్డు స్థాయి కోవిడ్ పరీక్షలు నిర్విస్తున్నారు.

ఇందులో కీలక పాత్ర పోషించింది మొబైల్ టెస్టింగ్ క్యాంపులు. ప్రతీ ఊరికి జిల్లాకు నియోజకవర్గానికి జగన్ సూచనల మేరకు కొన్ని బస్సుల ద్వారా మినీ క్యాంపు లాంటి వాటిని ఏర్పాటు చేయడంతో అది బాగా ప్లస్ అయ్యింది. ఇప్పుడు ఇలాంటి టెస్టులనే నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ అనుకుంటున్నారట. ప్రతీ నియోజకవర్గానికి ఒక బస్సును వేసి టెస్టులు మరింత స్థాయిలో పెంచాలని అనుకుంటున్నారట. అలాగే ఇక్క హైదరాబాద్ లోనే 20 బస్సులు వేయాలని ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.