‘కేసీఆర్’ అవుటాఫ్ కవరేజ్ ఏరియానా..?

Thursday, December 24th, 2015, 11:45:44 PM IST

తెలంగాణా సీఎం కేసీఆర్ నిన్నటి నుండి ఆయుత మహా చండీ యాగం మొదలు పెట్టిన విషయం తెలిసిందే. ఈ యాగం 5రోజుల పాటు నిర్విఘ్నంగా సాగనుంది. ఈ యాగాన్ని కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మాట తెలిసిందే. అందుకే కర్త, కర్మ, క్రియ అన్నీ ఆయనే అయి యాగాన్ని ముందుకు నడుపుతున్నారు. యాగం పూర్తవటానికి ఇంకో నాలుగు రోజులు పడుతుంది. అంటే కేసీఆర్ మరో నాలుగు రోజులు ఒక పూట భోజనం చేస్తూ రాష్ట్ర పాలనా కార్యకలాపాలకు దూరంగా ఉంటారన్నమాట.

అసలు ఒక్కరోజు ముఖ్యమంత్రి పాలనా విషయాల్లో జోక్యం చేసుకోకుంటేనే రాష్ట్ర పాలన కాస్త తడబడుతుంది. అలాంటిది ఏకంగా ఐదు రోజుల పాటు కేసీఆర్ యాగ ప్రాంగణంలోనే ఉంటే సమర్థవంతమైన పాలనా లోటు ఖచ్చితంగా కనిపిస్తుంది. కానీ టీఆర్ఎస్ నేతలుగాని, ప్రతిపక్ష నేతలు గాని ఈ విషయాన్ని సరిగా గమనించినట్లు లేదు..అందుకే ఈ విషయంపై ఎవరూ మాట్లాడటం లేదు. కానీ కేసీఆర్ గారిని అంత తక్కువగా అంచనా వేయటానికి వీల్లేదు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చేత పనులన్నీ చక్కబెట్టించినా బెట్టిస్తాడు. చూడాలి కేసీఆర్ ప్రత్యక్ష పాలనకు దూరంగా ఉండటం వలన ఎలాంటి ఫలితాలొస్తాయో..?