మరొక పదేళ్ల వరకూ నేనే సీఎం – కేసీఆర్

Sunday, February 7th, 2021, 08:00:18 PM IST

తెలంగాణ రాష్ట్రం లో ప్రస్తుతం ముఖ్యమంత్రి గా కొనసాగుతున్న కేసీఆర్ కొద్ది రోజుల తర్వాత కుమారుడు కేటీఆర్ కి సీఎం పదవి అప్పగిస్తారు అంటూ వస్తున్న ఊహాగానాల పై కేసీఆర్ ఒక స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యం గా ఉన్నట్లు తెలిపారు. మరొక పదేళ్ల వరకూ సీఎం గా ఉంటా అంటూ తెలంగాణ భవన్ లో కార్యవర్గం సమావేశం లో వెల్లడించారు. అయితే కేటీఆర్ సీఎం అంటూ పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు అని, గీత దాటి మాట్లాడితే కఠిన చర్యలు ఉంటాయి అంటూ ఎమ్మెల్యే లకు, ఎంపీ లకు, నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.

అయితే వచ్చే ఏప్రిల్ లో లక్షల మంది తో భారీ బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ ఆలోచన లో ఉన్నట్లు తెలుస్తోంది. ఏ జిల్లా వాళ్లు ముందుకు వస్తే అక్కడే సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా 50 వేల మంది సభ్యత్వం నమోదు చేయించాలని సూచించినట్లు తెలుస్తోంది. అయితే ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్ధి గా రాజేశ్వర్ రెడ్డి ను కన్ఫర్మ్ చేసింది సీఎం కేసీఆర్. ఈ ఎన్నికలో కూడా గెలవాలంటూ ఆయా ప్రాంత నేతలను దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.