నేడు ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేయనున్న కల్వకుంట్ల కవిత

Thursday, October 29th, 2020, 08:30:11 AM IST

తెలంగాణ రాష్ట్రం లో ఇటీవల నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తెరాస పార్టీ కి చెందిన కల్వకుంట్ల కవిత భారీ మెజారిటీ తో విజయం సాధించారు. అయితే ఎమ్మెల్సీ గా గెలవడం తో నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు కవిత. అయితే నేడు మధ్యాహ్నం 12:45 నిమిషాలకు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

అయితే శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కవిత తో ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు. ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి అంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తో పాటుగా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కి చెందిన ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీ లు కూడా ఈ హజరు కానున్నారు. 2014 నుండి 2019 వరకు లోక్ సభ సభ్యురాలిగా నిజామాబాద్ నుండి కవిత ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే కవిత ప్రమాణ స్వీకారం పూర్తి చేయాల్సి ఉండగా, హోమ్ క్వారంటైన్ కి వెళ్ళడం తో ఈ కార్యక్రమం వాయిదా పడింది.