కేటీఆర్ సీఎం అయితే కవితకు పక్కాగా మంత్రి ఛాన్స్..!

Saturday, January 23rd, 2021, 02:33:50 AM IST


తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నారన్న అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాఫిక్ అయ్యింది. టీఆర్ఎస్ ముఖ్యనేతలు ఇందుకు సంబంధించి సంకేతాలు ఇవ్వడంతో కేటీఆర్ సీఎం కావడం దాదాపు ఖాయమైనట్టు తెలుస్తుంది. అయితే ఇందుకోసం వచ్చే నెలలో ముహూర్తం కూడా ఫిక్స్ అయినట్టు కథనాలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే కేటీఆర్ సీఎం అయితే కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితకు కూడా కీలక పదవి దక్కబోతుందని పార్టీలో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

అయితే సీఎంగా కేటీఆర్ బాధ్యతలు చేపడితే కేసీఆర్ మంత్రివర్గం రద్దవుతుంది. అప్పుడు కేటీఅర్ హయాంలో మళ్లీ కొత్త మంత్రివర్గం ఏర్పాటు అవుతుంది. అయితే కేబినెట్ కూర్పులో ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయని, ఆ మార్పుల్లో భాగంగానే కవితను మంత్రివర్గంలోకి తీసుకుంటారని పలువురు నేతలు భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కేటీఆర్ చూస్తున్న కీలకమైన మున్సిపల్ శాఖ బాధ్యతలు కవితకు అప్పచెప్పే ఛాన్స్ ఉండొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.