బీజేపీలో చేరబోతున్న బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక..!

Sunday, November 22nd, 2020, 03:00:34 AM IST

బిగ్‌బాస్ ఫేమ్, యాంకర్ కత్తి కార్తీక త్వరలో బీజేపీలో చేరనున్నారు. తాజాగా ఆమె కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆమెను బీజేపీలోకి ఆహ్వానించినట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరి చర్చల అనంతరం పార్టీ మార్పుపై ఆమె నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రెండు, మూడు రోజుల్లో పార్టీ మార్పుపై తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని కత్తి కార్తీక ప్రకటించారు.

ఇదిలా ఉంటే ఇటీవల దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుంచి పోటీ చేశారు. అందరి కంటే ముందుగానే దుబ్బాకలో ప్రచారాన్ని మొదలుపెట్టిన కత్తి కార్తీక అధికార పార్టీపై ఘాటైన విమర్శలు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. తనను గెలిపిస్తే దుబ్బాక అభివృద్ధి కోసం పోరాడుతానని చెప్పుకొచ్చింది. కాగా ఆమెకు ఈ ఎన్నికలో 630 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.