అల్లరి నరేష్ ని ఆ హీరో దెబ్బ కొట్టాడా ?

Thursday, November 3rd, 2016, 11:28:23 AM IST


ఈ మధ్య అల్లరి నరేష్ ఎన్ని సినిమాలు చేసినా పెద్దగా హిట్స్ మాత్రం రావడం లేదు…? బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా వర్కవుట్ కావడం లేదు. దాంతో … ఈ సారి హర్రర్ జోనర్ లో గట్టి ప్రయత్నాలు .. చేస్తున్నాడు. కామెడీ చిత్రాల దర్శకుడు నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ”ఇంట్లో దయ్యం నాకేం భయం” సినిమా ఈ నెల 11 న విడుదల అవుతుంది. ఈ సినిమాలో అల్లరి నరేష్ మంత్రగాడిగా కనిపిస్తాడని పోస్టర్స్ చేస్తే అర్థం అవుతుంది. అయితే నరేష్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో ఖచ్చితంగా హిట్ కొట్టాలని? కానీ ఆ ఆశలపై నీళ్లు చల్లేలా ఉన్నాడు తమిళ్ హీరో కార్తీ ? ఎందుకంటే అయన లేటెస్ట్ సినిమా ”కాష్మోరా” లోకూడా కార్తీ దయ్యాలను వదిలించే వాడిగా కామెడీ పంచాడు..? ఇందులో నరేష్ కూడా అచ్చంగా అలాంటి పాత్రే కావడంతో .. ‘కాష్మోరా’ ఎఫెక్ట్ తో నరేష్ కామెడీ వర్కవుట్ అవుతుందో లేదో అనే అనుమానాలు సినిమా యూనిట్ లో మొదలయ్యాయట !! మరి నరేష్ పెట్టుకున్న ఆశలు నెరవేరతాయో లేదో చూడాలి !!