బ్రేకింగ్: లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి రమేష్ జర్కిహోలి రాజీనామా

Wednesday, March 3rd, 2021, 03:43:53 PM IST

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక జల వనరుల శాఖ మంత్రి రాజీనామా చేశారు. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి మహిళ పై లైంగిక వేదింపులకు పాల్పడినట్లు గా ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రి రమేష్ జర్కిహోలి రాజీనామా చేశారు. అయితే ఈ మేరకు కర్ణాటక ముఖ్యమంత్రి యడియురప్ప కి ఆయన రాజీనామా లేఖ ను పంపారు. ఇందుకు సంబంధించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తన పై వచ్చిన ఆరోపణలు అన్ని కూడా అవాస్తవం అని వ్యాఖ్యానించారు. వాటిపై తక్షణమే దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. తాను ఏ తప్పూ చేయలేదు అని, అయితే నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

అయితే తన చిత్రాలను ఎవరో ఉపయోగించి సీడీ ను రూపొందించారు అని వ్యాఖ్యానించారు. దర్యాప్తు లో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి అని, దర్యాప్తు ను ఎదుర్కొంటా అని, వెనకడుగు వేయబోను అని నిన్న మీడియా సమావేశం లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే మహిళతో సన్నిహితంగా మెలిగిన దృశ్యాలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వేధించారని మహిళ ఆరోపణలు చేసింది. అయితే ఆ వీడియో కాస్త వైరల్ అవ్వడం తో మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు వెల్లువెత్తాయి.