టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కరాటే కళ్యాణి వార్నింగ్.. తాట తీస్తా..!

Saturday, January 23rd, 2021, 01:34:29 AM IST


అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వవద్దని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుపై విమర్శలు జోరందుకున్నాయి. అయితే తాజాగా బిగ్ బాస్ ఫేమ్, నటి కరాటే కళ్యాణి కూడా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు ఇవ్వొద్దని చెప్పడానికి ఈ ఎమ్మెల్యే ఎవరని ప్రశ్నించింది. ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తే తాట తీస్తామని హెచ్చరించింది. విరాళాలు ఎమ్మెల్యే ఇంట్లో నుంచి ఇస్తున్నాడా అని ప్రశ్నించింది.

అయితే ఎంతోమంది హిందువుల కోరిక ఈ రామాలయ నిర్మాణమని, రామమందిర నిర్మాణం కోసం తాము జోలె పట్టడానికైనా సిగ్గుపడమని కళ్యాణి అన్నారు. స్థానికంగా ఉన్న రామాలయాలను అభివృద్ధి చేస్తామన్నందుకే తగ్గి మాట్లాడుతున్నామని లేదంటే మరోలా ఉండేదని వార్నింగ్ ఇచ్చారు. అయితే రామ మందిర నిర్మాణానికి వేరేవాళ్లు విరాళాలు ఇస్తుంటే ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుకు ఎందుకు ఇబ్బంది అని ప్రశ్నించారు. తన వంతుగా హరికథలు చెప్పి విరాళాలు రామ మందిరం కోసం విరాళాలు సేకరిస్తానని కళ్యాణి చెప్పుకొచ్చారు.