భారత మాజీ క్రికెటర్ కపిల్ దేవ్‌కు హార్ట్ ఎటాక్..!

Friday, October 23rd, 2020, 05:54:10 PM IST

భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్‌కు గుండెపోటు వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే వెంటనే స్పందించిన వైద్యులు కపిల్‌కు ఆంజియో ప్లాస్టీ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని రెండు రోజుల్లో కపిల్‌దేవ్‌ని డిశ్చార్జ్‌ చేస్తామని వైద్యులు ప్రకటించారు.

అయితే కపిల్‌కు హార్ట్ ఎటాక్ అని తెలియగానే ఆయన అభిమానులు ఒకింత ఆందోళన చెందారు. కపిల్ త్వరగా కోలుకోవాలంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు. టీమిండియా మాజీ కెప్టెన్, ప్రపంచ దిగ్గజ ఆల్ రౌండర్లలో ఒకరైన కపిల్ దేవ్ సారధ్యంలోనే ఇండియా వరల్డ్ కప్‌ను 1983లో గెలుచుకుంది.