అలా చేయడం సరికాదు.. సీఎం జగన్‌కి కన్నా లేఖ..!

Monday, April 6th, 2020, 08:20:04 PM IST

ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో ప్రభుత్వం పెద్ద ఎత్తున క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ నేపధ్యంలో ఏపీలోని కొన్ని ఆలయాల్లో కూడా క్వారంటైన్ కేంద్రాలను ప్రారంభించారు.

అయితే హిందూ ఆలయాల్లో క్వారంటైన్‌ సెంటర్ల ఏర్పాటును ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణ తప్పుపట్టారు. ఈ మేరకు ఏపీ సీఎం జగన్‌కి లేఖ రాసిన కన్నా శ్రీకాళహస్తి, కాణిపాకం వంటి ఆలయాలలో క్వారంటైన్‌ కేంద్రాలు నిర్వహించడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా భక్తుల మనోభావాలను, నమ్మకాలను దెబ్బతీసేలా ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.