రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయి.. కన్నా లక్ష్మీనారాయణ సంచలనం..!

Wednesday, January 6th, 2021, 03:05:55 PM IST

ఏపీలో దేవాలయలపై జరుగుతున్న వరుస దాడులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. అయితే రామతీర్ధం ఘటనను నిరసిస్తూ నిన్న బీజేపీ, జనసేన కలిసి ధర్మయాత్రను చేపట్టగా పోలీసులు అడ్డుకున్నారు. రామతీర్థం ధర్మయాత్రను ప్రభుత్వం అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా బీజేపీ ఆందోళనలు చేపడుతోంది. అయితే గుంటూరులో బీజేపీ చేపట్టిన నిరసనల్లో పాల్గొన్న బీజేపీ సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వ వైఖరిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయని అన్నారు. కలెక్టర్‌ స్థాయి అధికారుల సహకారంతో, ప్రభుత్వ మద్దతుతోనే రాష్ట్రంలో మత మార్పిడులు జరుగుతున్నాయని కన్నా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 120కి పైగా ఆలయాలపై దాడులు జరిగాయని దాడులను ఖండిస్తున్న ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఎదురుదాడి చేయడం సిగ్గు చేటని అన్నారు. రేపు మరోసారి బీజేపీ ఛలో రామతీర్థం యాత్ర చేపడుతున్నట్టు కన్నా చెప్పుకొచ్చారు.