బిగ్ బ్రేకింగ్: రాష్ట్రంలో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరింది–కన్నా లక్ష్మి నారాయణ

Wednesday, November 13th, 2019, 10:41:02 AM IST

వైసీపీ చేస్తున్న పనులకు విసిగిపోయిన కన్నా లక్ష్మి నారాయణ పలు సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో వైసీపీ పిచ్చి పరాకాష్టకు చేరింది దుయ్యబట్టారు. బడిని, గుడిని వదలని వైసీపీ వాళ్ళు అవకాశం ఉంటే ఇసుకపై, ఇంద్ర ధనస్సుకి కూడా రంగులేసేలా వున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా అన్యమత ప్రచారాన్ని జరిపే తీరుని చాల దారుణంగా దుయ్యబట్టారు. అన్నవరం లో అన్యమత ప్రచారం, భవానీ ఐలాండ్ లో ఆర్చి పై బొమ్మల ఏర్పాటు, భీమిలి ఉత్సవ్ లో మతపరమైన స్టాల్స్ ఏర్పాటు వైసీపీ మతవ్యాప్తిని సూచిస్తున్నాయి అని మండిపడ్డారు.

ఇసుక కొరత పై, వైసీపీ రంగుల పై కన్నా లక్ష్మి నారాయణ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఇపుడు ఈ పిచ్చి పరాకాష్టకు పోయిందని ఉద్దేశించి పలు ఫోటోలను కూడా సోషల్ మీడియా ద్వారా ప్రజలతో పంచుకున్నారు. అయితే కొందరు ఈ విషయంలో స్పందించారు. అయితే కొందరు ఆంధ్ర ప్రదేశ్ ని అన్యమత ప్రదేశ్ అంటూ జగన్ ప్రభుత్వం పై విమర్శలు చేసారు. ఏదేమైనా వైసీపీ నిర్ణయాలతో ప్రతి పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.