బిగ్ న్యూస్: సీఎం జగన్ రాజీనామా చేయాలి… కన్నా లక్ష్మీ నారాయణ డిమాండ్!!

Monday, June 1st, 2020, 03:50:37 PM IST

ఆంధ్ర ప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే హక్కు లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ప్రజలు జగన్ ను నమ్మి ఓట్లు వేస్తే నిజ స్వరూపం చూపిస్తున్నారు అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఏడాది పాలన పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

అనుభవ రాహిత్యం, అసమర్థ పాలన, కక్ష సాధింపు, అహంకారం, ఆత్రం, అప్పులు, అవినీతి రివర్స్ పాలన, హైకోర్టు తో మొట్టి కాయలు, ఏడాది పాలన ఇలానే సాగింది అని కన్నా లక్ష్మీ నారాయణ ఘాటు విమర్శలు చేశారు.ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తుంది అని, అందుకు హైకోర్టు ఇచ్చిన తీర్పు లే నిదర్శనం అని వ్యాఖ్యానించారు.కౌన్సిల్ లో తనకు వ్యతిరేకంగా బిల్లు పెట్టిన సంగతి తెలిసిందే. సెలెక్ట్ కమిటీ కి పంపడం తో కౌన్సిల్ నే రద్దు చేయించాడు అని, అది ఆయన అహంకారానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

చంద్రబాబు పై అవినీతి ఆరోపణలు చేసిన జగన్, ఏడాది పాలనలో ఎందుకు విచారణ జరిపించ లేదు అని అన్నారు.వాలంటీర్ వ్యవస్థ పై కూడా కన్నా లక్ష్మీ నారాయణ నిప్పులు చెరిగారు. హిందూ దేవాలయాలు, భక్తుల మనోభావాలు దెబ్బ తినేలా జగన్ వ్యవహరిస్తున్నారు అని సంచలన ఆరోపణలు చేశారు.స్థానిక ఎన్నికల్లో వైసీపీ భయంకర వాతావరణం సృష్టించి ప్రక్రియ ను అస్తవ్యస్తం చేశారు అని కన్నా లక్ష్మీ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల కమిషనర్ కె కులం ఆపాదించడం చూస్తుంటే జగన్ అహంకారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.